యనమలకు రాజకీయ గ్రహణం తప్పదా !

చంద్రబాబునాయుడు మంత్రిగానే కాకుండా, ఆయనకన్నా తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా, సుదీర్ఘకాలం మంత్రిగా అనుభవం ఉన్న నేతగా అనుభవం ఉన్న ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడుకు పార్టీలో రాజకీయ గ్రహణం పట్టనున్న సంకేతాలు వెలువడుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంత సీనియర్ మంత్రికి జాతీయ పతకాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పించక పోవడం పట్ల అధికార పార్టీ వర్గాలే విస్మయం చెందుతున్నాయి. ఒక విధంగా ఉద్దేశ్య పూర్వకంగా ఆయనను అవమానింఛిన్నట్లు భావిస్తున్నారు.

గత సంవత్సరం పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా చంద్రబాబునాయుడుతో పాటే అసెంబ్లీ లో ప్రవేశించిన నేతగా పేరున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణముర్తికి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇవ్వలేదు. ఈ సంవత్సరం యనమలను ప్రక్కన పెట్టారు. ఇదంతా ఉద్దేశ్య పూర్వకంగా పార్టీలో ముఖ్యమంత్రి వారసుడిగా  ప్రభుత్వంలో, ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న మంత్రి నారా లోకేష్ ప్రమేయంతోనే ఈ విధంగా జరుగుతున్నట్లు పలువ్రు భావిస్తున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాల్లో యనమల మద్దతు దారులను ప్రక్కన పెట్టె ప్రయత్నం జరుగుతున్నది.

స్వంతత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రతి జిల్లలో ఆయా జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులను జాతీయ పతకాన్ని ఆవిష్కరించామని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ ప్రకారం యనమల కృష్ణ జిల్లలో ఆవిష్కరించవలసి ఉంది. అయితే ఆ జిల్లాతో సంబంధం లేని, ఆయనకన్నా రాజకీయాలలో చాల జూనియర్ అయిన పరిటాల సునీతకు ఆ అవకాశం కల్పించారు. దీనిని అవమానంగా భావిస్తున్న యనమల మనస్తాపానికి గురైన్నట్లు తెలుస్తున్నది. కనీసం తన సొంత జిల్లా తూర్పు గోదావరిలో కూడా అవకాశం ఇవ్వక పోవడం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అద్యక్షుడు కూడా అయిన తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కళా వెంకట్రావుతో పాటు చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కే అచ్చెన్నాయుడుకు కూడా జాతీయ పతాకం ఆవిష్కరించే అవకాశం దక్కలేదు. కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మంత్రి కళా వెంకట్రావు స్థానంలో తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు. ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి  కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాకపోయినప్పటికీ ఆయనకు జిల్లాలోనే జాతీయ పతాకం ఆవిష్కరించే అవకాశం ఇచ్చారు.