కేరళలో మళ్ళి వరదలు ఉధృతం.. కోచ్ ఎయిర్ పోర్ట్ మూసివేత

తగ్గిన్నట్లే తగ్గి కేరళలో వరదలు మళ్ళిఉధృత రూపం దాల్చాయి. దానితో శనివారం మధ్యాన్నం వరకు కోచ్ విమానాశ్రయాన్ని ముసివేస్తున్నట్లు ప్రకటించారు. న్‌వే, పార్కింగ్‌ ఏరియా మొత్తంగా వరద నీటితో నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రైళ్ల రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి. అనేక రైళ్ళు రద్దు కావడమో లేదా ఆలస్యంగా నడవడమో జరుగుతున్నాయి.

కేరళ ప్రతేడాది ఎంతో ఘనంగా నిర్వహించే ఓనం ఉత్సవాలను కూడా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. 1924 తరాత కేరళ ఇంతటి భారీ వర్షాలను, విధ్వంసాలను చవిచూడలేదని ఆయన చెప్పారు.

గత వారం రోజుల నుండి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కేరళ అంతా అతలాకుతలమైంది. శనివారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనేక జిల్లాల్లో బుధ, గురువారాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ నెల 8 నుండి ఇప్పటివరకు 42మంది మరణించారు. ఈ శతాబ్దంలోనే అత్యంత అధ్వాన్నమైన పరిస్థితిగా దీన్ని పరిగణిస్తున్నారు.

 

దాదాపు 60వేల మంది సహాయ శిబిరాల్లో వున్నారు. పంటలు, ఆస్తులకు జరిగిన నష్టాన్ని రు.8వేల కోట్లుగా అంచనా వేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో ఇప్పటికే 45మంది మృతిచెందారు. రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో తాజాగా 12 జిల్లాల్లో వాతావరణ అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. వరద నీటితో దాదాపు 30 డ్యాములు నిండిపోయి.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

 

పురాతన ముళ్లపెరియార్‌ డ్యామ్‌కు వరదనీరు భారీగా వచ్చిచేరడంతో పూర్తిగా నిండిపోయి.. ప్రమాదస్థాయికి చేరుకుంది. ముళ్లపెరియార్‌ డ్యామ్‌ ఎత్తు 142 అడుగులు కాగా.. బుధవారం మధ్యాహ్నానికి 142 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.