8 రాష్త్రాలలో జమిలి ఎన్నికలకు ఈసి సిద్దం !

దేశంలో లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు జరపాలని ఒకవంక చర్చ జరుగుతూ ఉండగా, ఎనిమిది రాష్త్రాలలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి తాము సిద్దంగా ఉన్నట్లు ఎన్నికల కమీషన్ సంకేతం ఇచ్చింది. మిగిలిన రాష్త్రాలలో కూడా ఎన్నికలు జరపడానికి వివిపిఏటిలు లేకపోవడమే ప్రధాన సమస్యగా పేర్కొన్నది.

 

వచ్చే సంవత్సరం జరుగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు 12 అసెంబ్లీ లకు కూడా ఎన్నికలు జరిపించాలని మీడియా లో ఉహాగానాలు వచ్చిన నేపధ్యంలో ఈ విషయమై భారత ప్రధాన ఎన్నికల అధికారి ఓ పి రావత్ ఇచ్చిన సమాచారం ప్రాధాన్యతను సంతరింప చేసుకొన్నది. పైగా ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్, మిజోరాంలలో రాష్ట్రపతి పాలన విధించి, లోక్ సభతో పాటు వాటిల్లో ఎన్నికలు జరిపించడానికి కేంద్రం సిద్దమవుతున్నట్లు కూడా కధనాలు వెలువడ్డాయి.

ప్రస్తుతం లోక్ సభతో పాటు ఓడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు మరో మూడు రాష్త్రాలలో ఎన్నికలు జరపడానికి సిద్దమని రావత్ తెలిపారు. ఒడిస్స, తెలంగాణ, ఎపి లలో ఎట్లాగు లోక్ సభతో పాటు ఎన్నికలు జరుగావలసిందే. జమిలి ఎన్నికలకు మద్దతుగా బిజెపి అద్యక్షుడు అమిత్ షా లా కమీషన్ చైర్మన్ కు లేఖ పంపడంతో జమిలి ఎన్నికలకు బిజెపి సన్నాహాలు చేస్తున్నట్లు కధనాలు వచ్చిన్నట్లు కనిపిస్తున్నది.

ఎన్నికల కమీషన్ సమాచారం మేరకు ప్రస్తుతం లోక్ సభతో పాటు ఇదు రాష్త్రాలలో కుడా ఎన్నికలు జరిపించడానికి వారికి 14 లక్షల వివిపిఎటి ల అవారం ఉంది. ఇప్పటికే 17.4 లక్షలు సమకుర్చుకోవడానికి ఆర్డర్లు ఇచ్చి ఉన్నారు. 2.4 లక్షల వివిపిఎటి లను ముందస్తు జాగ్రత్తగా ఉంచుకొంటారు. వాటితో మూడు పెద్ద రాష్త్రాలలో ఎన్నికలు జరిపించవచ్చు. ఉదాహరణకు మధ్యప్రదేశ్ లో ఎన్నికలకు 80 వేలు అవసరం ఉంటాయి.