2018 సియోల్ శాంతి బహుమతి విజేత ప్రధాని మోదీ

`మోడీనోమిక్స్’ ద్వారా భారత దేశంలో, తద్వారా ప్రపంచంలో అత్యధిక ఆర్ధిక ప్రగతికి కృషి చేదినందుకు గుర్తింపుగా ప్రతిష్టాకరమైన 2018 సియోల్ శాంతి బహుమతి విజేతగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరును ప్రకటించారు. ఈ అవార్డు కు ఎంపిక చేయడానికి ప్రపంచ శాంతికోసం, మానవ అభివృద్ధి మెరుగుదల కోసం, భారత దేశంలో ప్రజాస్వామ్య వికాసం కోసం కృషి చేసినందుకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ బహుమతికి ఎంపిక చేసిన్నట్లు దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖా ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ బహుమతి పొందిన వారిలో మోదీ 14వ వారు కాగా, భారత దేశం నుండి మొదటివారు కావడం విశేషం. నోబెల్ శాంతి బహుమతికి సమానంగా ఆసియా శాంతి బహుమతిగా పరిగనిస్తారు. భూమి మీద శాంతి నేలకోనలనే కొరియా ప్రజల ఆశలకు చిహ్నంగా ఈ బహుమతిని ఏర్పాటు చేసారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి ఇచ్చే ఈ బహుమతి క్రింత జ్ఞాపికతో పాటు 2 లక్షల అమెరికా డాలర్ల నగదు పారితోషికం కూడా లభిస్తుంది.

అంతర్జాతీయ సహకారం పెంపోదింప చేయడంకోసం, ప్రపంచ ఆర్ధిక వృద్ది రేట్ ను పెంపోదింప చేయడం కోసం, ప్రపంచంలోనే అతి పెద్ద-వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా భారత్ ను తీర్చి దిద్దడం ద్వారా భారత్ ప్రజల మానవ వికాసానికి దోహదపడిదినందుకు గాను, అవినీతి వ్యతిరేక-సామాజిక సమ్మిలిత కార్యక్రమాల ద్వారా ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందడానికి కృషి చేసినందుకు గాను ఈ బహుమతి ప్రకటిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.

సంపన్నులు, పేదల మధ్య ఆర్ధిక అంతరాలు తొలగించడం కోసం ప్రధాని మోడీ `మోదినోమిక్స్’ ద్వారా చేసిన కృషిని గుర్తిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పలు అవినీతి వ్యతిరేక చర్యలు, నోట్ల రద్దు ద్వారా ప్రభుత్వాన్ని సంస్కరించారని బహుమతి ప్రకటించిన కమిటీ కొనియాడింది. అట్లాగే క్రియాశీల విదేశాంగ విధానం ద్వారా `మోడీ డాక్త్రీన్’, `యాక్ట్ ఈస్ట్ పాలసీ’ వంటి విధానాలతో ప్రపంచంలోని దేశాలతో సంబంధాలను మెరుగు పరచుకొంటూ ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి తోడ్పడారని కుడా ప్రశంసించింది.

ఈ బహుమతి ప్రకటించడం పట్ల భారత ప్రధాని మోదీ సంతోషం, కృతజ్ఞత వ్యక్తం చేస్తూ కొరియా రిపబ్లిక్ తో భారత్ కు గల లోతయిన సంబంధాల దృష్ట్యా ఇదొక్క గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానికి, నిర్వాహకులకు అనుకూలమైన తేదిలో ఈ బహుమతిని సియోల్ శాంతి బహుమతి ఫౌండేషన్ అందజేస్తుంది. ఈ బహుమతిని సియోల్ లో జరిగిన 24వ ఒలింపిక్స్ పోటీల సందర్భంగా 1990లో ఏర్పాటు చేసారు. ఈ పోటీలలో అత్యధికంగా 160 దేశాలకు చెందినా క్రీడాకారులు పాల్గొని అంతర్జాతీయంగా స్నేహపూర్వక, సయోధ్య  వాతావరణ ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసారు.