తిత్లీ తుపాన్ ప్రచారంలో చంద్రబాబు.. భాధితుల సహాయంలో నవీన్ పట్నాయక్ !

తిత్లీ తుపాను ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాతో పాటు పోరుగానే ఉన్న ఒడిషా లో కుడా భారీ నష్టం కలిగించింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రులు, అధికారులతో వారం రోజుల పాటు అక్కడనే మకాం వేసి ప్రచార ఆర్భాటాల పట్ల దృష్టి సారిస్తూ, బాధితులకు మొక్కుబడి సహాయం అందించడంతో సరిపెట్టు కొంటున్నారు. అయితే ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రం అధికార బృందాలను ఏర్పాటు చేసి, రాష్ట్ర రాజధాని నుండే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ బాధితులను ఆదుకోవడం పట్ల శ్రద్ద చూపుతున్నారు.

దానితో తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో మన రాష్ట్ర ప్రభుత్వం కన్నా ఒడిశా ప్రభుత్వం మిన్నగా ఉన్నదనే అభిప్రాయం కలుగుతున్నది. ఉదారంగా స్పందించి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో బాధితుల మనోగతం ఇందుకు అద్దం పడుతోంది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలోని గజపతి జిల్లాపై 'తిత్లీ' తీవ్ర ప్రభావం చూపింది.

'పంటలు, చెట్లు, ఇళ్లు ఇలా ఒకటేమిటి సర్వం కోల్పోయాం.' అంటూ ఇరు రాష్ట్రాల్లోని బాధి తులూ ఆందోళనలు ఉన్నారు. తుపాను సాయం, సహాయక చర్యలపై ఒడిశా బాధితులు సంతృప్తి వ్యక్తం చేయగా, మన రాష్ట్ర బాధితులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం స్తున్నారు.  పక్కపక్కనే ఉన్న ఊళ్లలో సాయంలో తీవ్ర వ్యత్యాసం ఉండడం స్పష్టంగా కనిపిస్తున్నది. ఎపి ప్రభుత్వం తుపాను బాధితులకు బియ్యం 25 కిలోలు, నూనె, కందిపప్పు, బంగాళాదుంపలు ఒక్కో కిలో, పంచదార అర కిలో, లీటరు నీరు చొప్పున పంపిణీ చేసింది.

వీటిలో బియ్యం మినహా మిగిలిన సరుకుల విలువ రూ.220 ఉంటుంది. ఇస్తామన్న వాటిలో ఉల్లిపాయలు, సోలార్‌ లాంతర్లు, కొవ్వొత్తులు పూర్తిస్థాయిలో అందలేదు. ఒడిశా ప్రభుత్వం తుపాను వెళ్లిన మరుసటి రోజే ఒక్కొక్క కుటుంబానికీ 50 కిలోల బియ్యం ఇచ్చింది. ఇళ్లు కూలిపోయిన వారందరికీ టార్పాలిన్లు ఉచితంగా పంపిణీ చేసింది. నిత్యావసర సరుకుల నిమిత్తం కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున నగదు అందజేసింది. మరో రూ.రెండు వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రస్తుతం అటుకులు, బెల్లం, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలను ఒడిశా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 50 కిలోల బియ్యం తమకు నెల రోజులకుపైగా వస్తాయని ఒడిశా బాధితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 25 కిలోల బియ్యం 15 రోజులకు మించి రావంటూ శ్రీకాకుళం జిల్లా వాసులు వాపోతున్నారు. ఒడిశా మాదిరి ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం మంత్రులు, ఐఎఎస్‌ అధికారుల రాకపోకలతో హడావుడి చేస్తోందని బాధితులు పెదవి విరుస్తున్నారు.

:సర్వం కోల్పోయిన మా ఊరికి ప్రభుత్వం అరకొరగా సరుకులు అందజేసి చేతులు దులుపుకుంది. టార్పాలిన్లు, సోలార్‌ లాంతర్లు, కొవ్వొత్తులు ఇప్పటికీ ఇవ్వలేదు. ఇళ్లు కోల్పోయినవారంతా చినకుపడితే పరాయి పంచల్లో తలదాచుకోవాల్సి వస్తోంది. పాఠశాలల్లో భోజనాలు పెట్టి హంగామా చేసే బదులు, బియ్యం ఎక్కువిస్తే సరిపోయేది” అంటూ పొరుగు రాష్ట్రంలో బాధితులకు అందుతున్న సహాయం చూసి ఇక్కడి బాధితులు ప్రభుత్వ ధోరణిని తప్పు పడుతున్నారు.

ఒడిశా ప్రభుత్వం ప్రస్తుతం అటు కులు, బెల్లం, బిస్కెట్లు ఇస్తున్నారు. మరో రూ.రెండు వేల చొప్పున బాధితులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్పారు. సకాలంలో టార్పాలిన్లు ఇవ్వడంతో బాధితులకు ఎంతో ఉపశమనం కలిగించిన్నట్లు అయింది. అటువంటి దూరదృష్టి, బాధితుల పట్ల ఆవేదన చంద్రబాబునాయుడులో కనిపించడం లేదు. ఎంతసేపు ప్రచారం పట్ల ఆత్రమే కనిపిస్తున్నది.