ఒక కుటుంబం కోసం వీరుల త్యాగాలను విస్మరించారు : మోడీ

కేవలం ఒక కుటుంభాన్ని ప్రజల దృష్టిలో ఎక్కువ చేసి చూపడం కోసం దేశం కోసం ఘనమైన సేవలు అందించిన పలువురు వీరులను విస్మరిస్తూ వచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నెహ్రు-గాంధీ కుటుంభంపై పరోక్షంగా విరుచుకు పడ్డారు. ఇతరుల కున్న `ఒక కుటుంభం’ మాత్రమె గొప్పదనే అభిప్రాయం కలిగించడం కోసం సరదర్ పటేల్, భీమారావు అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప నేతలు స్వాతంత్ర్య పోరాటంలో చేసిన అసమాన త్యాగాలను విస్మరింప చేసేందుకు కృషి చేసారని మండిపడ్డారు.

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ‘ఆజాద్‌ హిందూ సర్కార్‌’ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తూ తమ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చి వేసినదని చెప్పారు. చారిత్రాత్మకమైన ఆజాద్ హింద్ ఫుజి టోపిని ధరించిన ప్రధాని ఈ సందర్భంను పురస్కరించుకొని ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. ఆజాద్ హిందూ ఫుజ్ సభ్యులపై విచారణ జరిపిన ఎర్రకోటలోని మూడవ బరాక్ లో ఈ ఫలకాన్ని ఉంచుతారు. అక్కడనే ఒక ప్రదర్శనశాలను కుడా ఏర్పాటు చేస్తారు.

స్వాతంత్ర్యానంతరం బ్రిటిష్ విధానాలను అనువుగా మనం విధానాలు రూపొందించుకొంటున్నామని ద్వాజమేట్టుటు “బ్రిటిష్ వారి కాళ్ళ జోళ్ళ నుండి పరిస్థితులను గమనిస్తున్నాము” అని చెప్పారు. దాని వల్లన విద్య తదితర కీలక రంగాలకు చెందిన విధానాలు దారి తప్పాయని విచారం వ్యక్తం చేసారు. పటేల్, బోస్ వంటి నేతల మార్గదర్శనం అనుసరించి ఉంటె భారత్ ఎంతో ప్రయోజనం పొందే ఉండేదని చెబుతూ తమ ప్రభుత్వం ఈ పరిస్థితిని మారుస్తున్నదని స్పష్టం చేసారు.

దేశంలోని ప్రతి ఒక్కరూ సమాన హక్కులు, అవకాశాలతో జీవించాలన్నదే నేతాజీ ఆశయమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలతో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన భారతావని కోసం నేతాజీ కలలు కన్నారన్న ప్రధాని విభజించు పాలించు అనే అంశాన్ని రూపుమాపేందుకు నేతాజీ తన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. ఇన్నేళ్లు గడుస్తున్నా నేటికీ ఆయన ఆశయాలు నేరవేరలేదని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు.

బ్రిటిష్ వలస పాలకుల నుంచి దేశానికి విముక్తి కల్గించిన స్వాతంత్ర్య పోరాట యోధుల త్యాగాలను వృథాకానీయరాదని, సుపరిపాలన అందించడం ద్వారా స్వరాజ్‌ను సురాజ్‌గా మలుచుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పైన ఉందని ప్రధాని మోదీ అన్నారు

గత నాలుగేళ్ల కాలంలో రక్షణరంగం బలోపేతానికి అనేక చర్యలు తీసుకున్నామన్న ప్రధాని నూతన సాంకేతికతలను దేశ రక్షణరంగంలోకి ప్రవేశపెడుతున్నామని చెప్పారు. మెరుపు దాడుల నుంచి నేతాజీ వివరాలను ప్రజానీకానికి అందుబాటులోకి తేవడం ఎవరూ ఎలాంటి కీలక నిర్ణయాలను తీసుకోవడంలోనైనా ఎన్డీయే ప్రభుత్వం ముందుంటుందన్న ప్రధాని లక్షల మంది ప్రాణత్యాగాలతో సిద్ధించిన ఈ స్వరాజ్యం సురాజ్యంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు.

తూర్పు, ఈశాన్య భారతంలోని ప్రాంతాల పట్ల నేతాజీ ద్రుష్టి సారించేవారని అంటూ స్వాతంత్ర్యానంతరం ఈ రెండు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విచారం వ్యక్తం చేసారు. భారత `దేశ ప్రగతికి ఇంజన్’గా ఈశాన్య భారతాన్ని తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని గుర్తు చేసారు.

మహిళలను సైన్యంలోకి ప్రోత్సహించిన మొదటి నేత నేతాజీ అని చెబుతూ భారత జాతీయ సైన్యంలో `రాణి ఝాన్సీ రెజిమెంట్’ను కేవలం మహిళలతో ఏర్పాటు చేసినప్పుడు ఆయన కుడా కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారని గుర్తు చేసారు. ఈ రెజిమెంట్ ఏర్పడి సోమవారానికి 75 ఏళ్ళు అవుతుందని చెప్పారు. నేతాజీ మార్గదర్శనంలో తమ ప్రభుత్వం కుడా సైన్యంలో మహిళలను ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నాటు భారత నావికా దళంలో మహిళా పోరాట పైట్లట్ల మొదటి జట్టు సిద్దంగా ఉన్నదని, త్వరలో కార్యక్షేత్రంలోకి దిగానున్నదని ప్రధాని ప్రకటించారు.