పుణే బ్యాంకుపై సైబర్ దాడి....రూ.94 కోట్లు గల్లంతు

 

హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకులకు సైబర్ కన్నాలు వనేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల సౌకర్యం వారికి సులభమార్గంగా మారింది. తాజాగా పుణేలోని కాస్మోస్ బ్యాంకు నుంచి హ్యాకర్లు రూ.94 కోట్లు లాగేసుకున్నారు. వేల కార్డులు క్లోన్ చేసి, వేల లావాదేవీలు జరిపి బ్యాంకు సొమ్మును హ్యాకర్లు లాగదేసుకోవడం బ్యాంకు సర్కిల్స్‌లో సంచలనం కలిగిస్తున్నది.

కెనడా నుంచి హ్యాకర్లు ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తున్నదని అధికారులు తెలిపారు. పుణేలోని తి పురాతనమైన సహకార బ్యాంకుల్లో కాస్మోస్ ఒకటి. సైబర్ దాడిసలో కాతాదారులెవరూ నష్టపోలేదని, బ్యాంకు పూలు సొమ్ము నుంచి హ్యాకర్లు సొమ్మును లాగేసుకున్నారని అధికారులు అంటున్నారు.

ఆగస్టు 11-13 తేదీల మధ్య ఈ సైబర్‌లూటీ జరిగింది. గణేశ్‌ఖిండ్ రోడ్డులోని బ్యాంకు ప్రధాన కార్యాలయానికి చెందిన సుహాస్ గోఖలే అనే అధికారి పోలీసులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. బ్యాంకుకు చెందిన ఖాతాదారుల వీసా, రూపే కార్డుల సమాచారాన్ని రాబట్టుకున్న గుర్తుతెలియని హ్యాకర్లు ఆగస్టు 11న 14,849 లావాదేవీలు జరిపి రు.80 కోట్లు కాజేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆగస్టు 13న స్విఫ్ట్ బదిలీని ఉపయోగించుకుని హాంకాంగ్‌లోని ఖాతాకు రు.13.94 కోట్లను చేరవేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.