జమ్మూ మునిసిపల్ కార్పొరేషన్ లో బిజెపి హవా

జమ్మూ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపికి స్పష్టమైన ఆధిక్యత లభించింది. 75 మంది సభ్యులున్న కార్పొరేషన్ లో ఇంతకు ముందు 25 మంది మాత్రమె గెలుపొందగా, ఇప్పుడు సగం మందికి పైగా 43 స్థానాలను గెల్చుకొంది. కాంగ్రెస్ గత ఎన్నికలలో 26 మందిని గెల్చుకోగా ఇప్పుడు ఆ పార్టీ నుండి కేవలం 14 మంది మాత్రమె ఎన్నికయ్యారు. అయితే ఎన్నికలలో పిడిపి, ఎన్సిపి, బిఎస్పి పార్టీలు పోటీ చేయనే లేదు. 13 ఏళ్ళ తర్వాత ఎన్నికలు జరిగాయి. స్వతంత్రులు మొత్తం 18 మంది గెలుపొందారు.

కాగా, జమ్మూ ప్రాంతంలో గల 36 మునిసిపల్ కమిటీలలో 446 వార్డులు ఉండగా, బిజెపి 15 మునిసిపాలిటిలలో, కాంగ్రెస్ 5 చోట్ల ఆధిక్యత సాధించగా, స్వతంత్రులు 12 చోట్ల ఆధిక్యతలో ఉన్నారు. మొత్తం మీద బిజెపి 169 వార్డులను, స్వతంత్రులు 167 వార్డులను, కాంగ్రెస్ 96 వార్డులను గెల్చుకున్నాయి.

ఈ విజయం ప్రజా విజయం అని, తమపై వారుంచిన విశ్వాసానికి నిదర్శనమని రాష్ట్ర బిజెపి అద్యక్షుడు రవీందర్ రైనా పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టికి, దేశాన్ని నూతన అభివృద్ధి పధం వైపు తీసుకు వెళ్ళడానికి చేస్తున్న కృషికి, పార్టీ నాయకులు, కార్యకర్తలు జరుపుతున్న కష్టానికి ఈ విజయం అద్దం పడుతున్నట్లు తెలిపారు.