దక్షిణ కాశ్మీర్ మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉన్న దక్షిణ కాశ్మీర్ లోని నాలుగు జిల్లాల్లో పట్టణ ప్రాంతాలలో పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికలలో బిజెపి ఘన విజయం సాధించింది. మొత్తం 132 వార్డులు ఉండగా, ఫలితాలు ఇప్పటి వరకు ప్రకటించిన 94 వార్డ్ లలో, సగంకు పైగా వార్డ్ లను – 53ను గెల్చుకున్నది. గత నెల నాలుగు దశలలో జరిగిన ఈ ఎన్నికలలో మొత్తం 20 పురపాలక సంఘాలు ఉండగా, వాటిల్లో కనీసం నాలుగు చోట్ల సొంతంగా ఆధిక్యతను పొందింది. అనంతనాగ్, ఉల్గం, పుల్వామా, షోపియన్ జిల్లాల్లో ఈ ఎన్నికలు జరిగాయి.

కాంగ్రెస్ 28 వార్డ్ లను గెల్చుకొని, కనీసం మూడు పురపాలక సంఘాలలో ఆధిక్యతను పొందింది. శోపిన్ జిల్లాల్లో ని 12 వార్డ్ లలో పోటీ లేకుండా బిజెపి అభ్యర్ధులు గెలుపొందగా, మరో ఇదు వార్డ్ లలో ఎవ్వరు నామినేషన్లు వేయనే లేదు. దేవ్సర్ మున్సిపల్ కమిటీలో అన్ని ఎనిమిది వార్డ్ లను బిజెపి గెల్చుకొంది. ఇక్కడ నుండి శాసనసభలో కాంగ్రెస్ నేత మొహమ్మద్ అమిన్ భట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

క్యజిగుండ్ మునిసిపల్ కమిటీలో బిజెపికి సాధారణ ఆధిక్యత లభించింది. మొత్తం ఏడు వార్డులు ఉండగా నలుగు వార్డ్ లలో గెలుపొందింది. పహల్గం లో 13 వార్డ్ లలో ఏడు చోట్ల బిజెపి అభ్యర్ధులు గెలుపొందారు. మిగిలిన ఆరు చోట్ల అభ్యర్ధులు ఎవ్వరు లేరు.

మరోవంక, ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు జి ఏ మీర్ కు మంచి పట్టుగల దూరు మునిసిపల్ కమిటీలో కాంగ్రెస్ మొత్తం 17 వార్డులు ఉండగా 14 చోట్ల గెలుపొందింది. ఒక సీట్ ఖాళీగా ఉంది. బిజెపి రెండు చోట్ల గెలిచింది. కోకేర్నగ్ లో ఎనిమిది వార్డ్ లలో ఆరు చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. యరిపోర లో కాంగ్రెస్ మూడు చోట్ల గెలుపొందగా, మిగిలిన మూడు వార్డులలో ఎవ్వరు పోటీ చేయనే లేదు. అనంతనాగ్, మట్టన్ లలో వోట్ల లెక్కింపు కొనసాగుతున్నది.

ఇక మిగిలిన ప్రాంతాలలో, బుద్గంలో కాంగ్రెస్ ఆరు వార్డులను గెలుపొందగా, బిజెపి నాలుగు గెలుపొందింది. మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. చరార్-ఇ-శారిఎఫ్ లో 13 వార్డ్ లలో 11 చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. మిగిలిన రెండు వార్డులు ఖాళీగా ఉన్నాయి. చదూర లో కుడా 8 వార్డ్ లలో 6 వార్డ్ లను కాంగ్రెస్ గెల్చుకొంది.