నవీన్ జిందాల్‌కు సమన్లు

జార్ఖాండ్ కోల్ బ్లాక్‌ల కేటాయింపుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు పంపింది. జిందాల్‌తో పాటు మరో 14 మందికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 15న కోర్టు ముందు హాజరుకావాలని ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాశర్ ఆదేశించారు.

 

జిందాల్ సంస్థ - జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెట్ (జేఎస్‌పీఎల్), ఇతరులు కోల్‌బ్లాక్‌ల కేటాయింపులకు సంబంధించిన స్క్రీనింగ్ కమిటీని ప్రభావితం చేశారని, ముడుపులుగా రూ.2 కోట్లకు పైగా వెచ్చించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తుది నివేదికలో పేర్కొంది. జార్ఖాండ్‌లోని అమర్‌కొం ముర్గదాంగల్ కోల్ బ్లాక్‌ల కేటాయింపులకు సంబంధించిన కేసు ఇది.