యువ మోర్చా అధ్యక్షుడిగా రమేష్‌ నాయుడు

బిజెపి  రాష్ట్ర విభాగాలకు అధ్యక్షులను పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నీయమించారు. యువ మోర్చా అధ్యక్షుడిగా ఎన్‌.రమేష్‌ నాయుడు, కిసాన్‌ మోర్చాకు వి.సూర్యనారాయణ రాజు, ఎస్సీ మోర్చాకు ఇస్కా సునీల్‌, మహిళా మోర్చాకు తోట విజయలక్ష్మి, ఎస్టీ మోర్చాకు కేకేవీవీవీ సత్యనారాయణరెడ్డి, ఓబీసీ మోర్చాకు జాగరపు రామమోహనరావు, మైనార్టీ మోర్చాకు షేక్‌ ఖలీఫతుల్లా భాషాలను అధ్యక్షులుగా నియమించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా దాసరి శ్రీనివాసులు, దిల్లీ సమన్వయకర్తగా కేవీరావు, పార్టీ వ్యవస్థాగత నిర్మాణ కమిటీ ఛైర్మన్‌గా ఆర్‌.లక్ష్మీపతిని నియమించారు.