మానవాళికి ప్రేరణగా షిర్డి సాయిబాబా సందేశాలు

షిర్డి సాయిబాబా సందేశాలు మానవాళికి ప్రేరణగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ తెలిపారు. బాబా బోధించిన విశ్వాసం, సహన సూత్రాలు మానవాళిని ఆకట్టుకున్నాయని చెప్పారు. షిర్డీ వెళ్లిన మోదీ అక్కడ బాబా దర్శన అనంతరం విజిటర్స్ బుక్‌లో సాయిబాబా దర్శనం తర్వాత తనకు ఎంతో మానసిక ప్రశాంతతకు గురైనట్లు వ్రాసారు. విశ్వాసం, సహనంపై ఆయన చేసిన బోధనలు మానవాళికి ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు.

సమానత్వానికి షిర్డి సాక్ష్యంగా నిలుస్తుందని, అన్ని మతాలకు చెందిన ప్రజలు బాబా ముందు వంగి నమస్కరిస్తారని మోదీ గుర్తు చేసారు. సాయిబాబా బోధించిన `సబ్ కా మాలిక్ ఏక్‌హై’ అన్న సూత్రం ప్రపంచ శాంతికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.  భక్తులందరికీ సుఖసంతోషాలను ప్రదర్శించాలని సాయి పాదాలను వేడుకుంటున్నట్లు మోదీ బుక్‌లో రాశారు.

శిర్దిలో జరిగిన బహిరంగ సభలో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్తాపనలు చేసారు. శ్రీ సాయిబాబా సమాధి శత సంవత్సరం సందర్భంగా ప్రత్యేక వెండి నాణాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలమైన సమైక్య సమాజాన్ని నిర్మించడానికి, మానవాళికి ప్రేమతో సేవ చేయడానికి అవసరమైన మంత్రాన్ని సాయిబాబా బోధనలు ఇస్తాయని పేర్కొన్నారు. ప్రజా సేవకు మరో రూపంగా షిర్డీ ఎప్పుడు నిలుస్తుందని తెలిపారు.

మహారాస్త్రలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన –గ్రామీణ పధకం క్రింద నిర్మించిన సుమారు 2 లక్షల నూతన గృహాల తాళం చెవులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులకు ప్రధాని అందజేశారు. దసరా రోజున నూతన గృహాలను అందజేయ గలగడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. పేదరికంకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో ఇదొక్క పెద్ద ముందడుగు అని చెప్పారు.

2022 నాటికి `అందరికి ఇళ్ళు’ అందించడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ గత నాలుగేళ్ళల్లో 1.25 కోట్ల గృహాలను నిర్మించిన్నట్లు ప్రధాని తెలిపారు. ప్రతి ఇంటి నిర్మాణం నాణ్యతగా జరగటమే కాకుండా ప్రతి ఇంటికి మరుగు దొడ్డి, గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సదుపాయం కుడా ప్రభుత్వం అందిస్తున్నదని పేర్కొన్నారు. బహిరంగ మల విసర్జన లేని రాస్త్రంగా మార్చినందుకు మహారాష్ట్ర ప్రజలను ప్రధాని అభినందించారు. స్వచ్చ భారత్ కార్యక్రమాలు చేపట్టడంలో మహారాష్ట్ర ప్రభుత్వ కృషిని కూడా ప్రశంసించారు.