21న ఎర్ర కోటపై ప్రధాని జాతీయ పతాకావిష్కరణ

స్వాతంత్ర్యం సిద్దించినప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగష్టు 15న చారిత్రాత్మక ఎర్ర కోటపై జవహర్ లాల్ నెహ్రు నుండి ప్రధానమంత్రిగా ఎవ్వరున్నా జాతీయ పతకాన్ని ఆవిష్కరించడం సాంప్రదాయంగా వస్తున్నది. అయితే మొట్టమొదటి సారిగా ఈ సంవత్సరం అక్టోబర్ 21న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోమారు జాతీయ పతకాన్ని ఆవిష్కరింపనున్నారు.

నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన `ఆజాద్ హిందూ ప్రభుత్వం’ 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆ రోజు జాతీయ పతకాన్ని ఆఇవ్శ్కరిస్తున్నత్లు చెప్పారు. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఆ రోజున బ్రిటిష్ వలస పాలకుల నుండి భారత దేశానికి నేతాజీ స్వాతంత్ర్య దేశంగా భారత్ ను అజ్ఞాతం నుండి ప్రకటించారు. అయితే ఇంతకాలం ఈ చారిత్రాత్మక ప్రాధాన్యత గల రోజును గుర్తించడంలో కాంగ్రెస్ పాలకులు తీవ్ర నిర్లక్ష్యం  చేసారు.

 పలు దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలకులు నిర్లక్షం చేస్తూ వస్తున్న పలువురు జాతీయ ఉద్యమ సారధులను తమ ప్రభుత్వం ఏ విధంగా గౌరవిస్తూ వస్తుందో బిజెపి కార్యకర్తలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని సవివరంగా వివరించారు. అక్టోబర్ 21 ప్రాధాన్యత ఏమిటని కొందరు తనను విమర్శలు గురిచేయవచ్చని అంటూ ఆ రోజు తొలి స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడిన రోజని చెప్పుకొచ్చారు.

1943 అక్టోబర్ 21న స్వతంత్ర దేశ ప్రభుత్వాన్ని నేతాజీ ప్రకటించారని ఆయన గుర్తు చేసారు. అదే విధంగా గుజరాత్ లో నర్మదా నది తీరంలో ప్రపంచంలోనే అతి పెద్దదైనా సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని కుడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని ఆయన గుర్తు చేసారు. దేశంలో తొలి హోం మంత్రిగా వందలాది సంస్థానాలను సమైక్య పరచిన గొప్ప యోధుడు పటేల్ అని అంటూ ఆయనంటే కాంగ్రెస్ వారికి ఎప్పుడు మంటే అని ఎద్దేవా చేసారు.

చరిత్రలో పటేల్ ప్రాధాన్యతను గుర్తించడానికి కాంగ్రెస్ ఎప్పుడు ఇష్ట పడదని ఆయన ద్వజమెత్తారు. ఆ పేరు చెబితేనే అసహనానికి గురవుతారని మండిపడ్డారు. పటేల్ నుండి స్పూర్తి యువతరం స్పూర్తి పొందడానికి పటేల్ విగ్రహం తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు.

భీంరావు అంబేద్కర్, సుభాష్ బోస్, పటేల్ వంటి జాతీయ యోధుల పట్ల కాంగ్రెస్ ఎప్పుడు నిర్లక్ష్యం చూపుతూనే ఉన్నదని చెబుతూ జాతి నిర్మాణం కోసం దోహదపడిన వారందరినీ గుర్తుంచు కోవాలని బిజెపి కోరుకొంటున్నదాని పేర్కొన్నారు. ప్రముఖ గిరిజన నేతలకు ప్రదర్శన శాలలు ఏర్పాటు చేసామని చెబుతూ “ఈ దేశం కోసం సేవ చేసిన ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తాం” అని స్పష్టం చేసారు. కొద్ది రోజుల క్రితం తాను హర్యానాలో సర్ చోటు రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించనని ప్రధాని గుర్తు చేసారు.