గజ్వేల్‌లో కెసిఆర్ ను వెంటాడుతున్న ఓటమి భయం !

అసెంబ్లీ ఎన్నికలలో వంద సీట్లు గెల్చుకోవటమే తమ ముందున్న లక్ష్యం అంటూ తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతున్నప్పటికీ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఏమో గాని స్వయంగా ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో తిరిగి గెలుపొందటం పట్ల అనుమానం వ్యక్తం అవుతున్నట్లు తేలుతున్నది. అందుకనే ఎందుకైనా మంచిదని మరో నియోజకవర్గం నుండి కుడా పోటీ చేయాలనీ భావిస్తున్నట్లు అధికారపక్షపు వర్గాలు తెలుపుతున్నాయి.

ప్రస్తుత నియోజకవర్గంలో ఎన్ని సర్వేలు జరిపిస్తున్నా ప్రజలు చాల గుంభనంగా ఉంటున్నారని, తమ మనసులో మాట బైట పెట్టడం లేదని, దానితో కెసిఆర్ అబధ్రతా భావానికి గురవుతున్నారని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ స్థాయిలో నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని స్థానిక ప్రజలు భావిస్తున్నట్లు టీఆర్ఎస్ భావిస్తున్నాయి. కెసిఆర్ తన ఫాంహౌజ్‌ కోసమే కొంత మార్పులు, చేర్పులు చేసినా నియోజకవర్గం గురించి అసలు పట్టించుకోలేదని భావనలు వ్యక్తం అవుతున్నాయి.

ఉద్యమకారుడైన కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా తన సొంత నియోజకవర్గాన్ని చేయాల్సిన స్థాయి లో అభివృద్ధి చేయలేదనే అభిప్రాయాలు గజ్వేల్‌ ప్రజల నుంచి వచ్చినట్టు నిఘా వర్గాలు తెలపడంతో కెసిఆర్ కలవర పడుతున్నట్లు టీఆర్ఎస్ పేర్కొంటున్నాయి. గత ఏడాది కాలంగా సర్వేల మీద సర్వేలు చేయిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేతకు సంతృప్తికరమైన సమాచారం లభించక పోవడంతో ఇప్పుడు గజ్వేల్‌తోపాటు మరో సురక్షిత నియోజకవర్గం వైపు దృష్టిపెట్టారని తెలుస్తున్నది. ఈ మేరకు గత వారం తనను కలిసిన మంత్రులు, మిత్రులు, టీఆర్‌ఎస్‌ ప్రముఖ నేతలతో సంప్రదింపులు చేసినట్టు చెబుతున్నారు.

ముందస్తు ఎన్నికల కోసం రాజీనామా చేసిన తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయనీ, ప్రధానంగా తన రాజీనామాకు ప్రజల అమోదం లేదనే కఠిన వాస్తవం ఇంటెలిజెన్స్‌ అధికారులు సీఎంకు తన నివేదికల ద్వారా తెలియజేసినట్టు అధికార వర్గాలు పెర్కొంతునాయి.  గజ్వేల్‌లోనూ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించినప్ప టికీ, స్థానిక ప్రజలు గుంభనంగా ఉంటున్నారనే ప్రచారం తెలంగాణ భవన్‌లో జరుగుతున్నది. ఇప్పుడు తమ అభిప్రాయాలను, మనసులోని మాటలను బయటకు చెబితే నష్టమని భావిస్తున్నట్టు తెలిసింది. ఈవీఎంలో ఓటు మీటను నొక్కడం ద్వారా కచ్చితమైన తీర్పును ఇచ్చేందుకు స్థానిక ప్రజలు నిర్ణయించుకున్నారని అనుమానిస్తున్నారు.

ఆ ప్రాంత అభివృద్ధి కోసం గజ్వేల్‌ అభివృద్ధి అథారిటీ(గడ)ని ఏర్పాటు చేసినా అభివృద్ధి మాత్రం సీఎం స్థాయిలో చోటుచేసుకోలేదని సర్వత్రా వెల్లడవుతున్నది. ఎర్ర వెల్లిలోని తన 70 ఎకరాల ఫాంహౌజ్‌ కోసమే కొంతమేర అభివృద్ధి పేర హడావుడి చేశారనీ, అంతేతప్ప మరే ఇతర అభివృద్ధి పనులూ అనుకున్నంత జరగలేదనే అభిప్రాయంతో గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలు ఉన్న ట్టు స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలే చెబుతున్నారు. ఇప్పటికే  కొందరు గజ్వేల్‌ ద్వితీయ శ్రేణి నాయకత్వంతోపాటు మరికొందరు ప్రతిపక్ష పార్టీల్లో చేరేం దుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేసీఆర్‌ సైతం పునరాలోచనలో పడ్డట్టుగా ప్రచారం జరుగుతున్నది.

కేవలం నిఘా వర్గాల నివేదికలపైనే ఆధారపడకుండా, ప్రయివేటు సంస్థలతోనూ సర్వేలు చేయించినట్టుగా తెలుస్తున్నది. దానితో గజ్వేల్‌తోపాటు మేడ్చల్‌ నియోజకవర్గంలోనూ పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఇప్ప టికే టికెట్‌ నిరాకరించారు. అక్కడ తాను పోటీచేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయమై కూడా ప్రయివేటు సంస్థలతో కొన్ని ప్రశ్నలు రూపొందించి సర్వే చేయించారనే ప్రచారం కూడా ఉంది.

అదే సందర్భంలో ఉద్యమకారుడైన కేసీఆర్‌కు రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీచేసినా విజయం సాధిస్తాడనే ప్రచారం, నమ్మకం గతంలో ఉండేది. ఇప్పుడా అభిప్రాయానికి బీటలు వారే ప్రమాదం కనిపిస్తున్నాయి. గజ్వేల్‌లో ప్రజాధరణ తగ్గిందనే ప్రచారం రాష్ట్రం అంతటా  టీఆర్ఎస్ అభ్యర్ధుల విజయావకాశాలను ప్రభావితం చేయవచ్చని ఆ పార్టీ వర్గాలు మరోవంక ఆందోళన చెందుతున్నాయి. కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి పోటీచేయడం అప్ప ట్లో తమ అదృష్టంగా భావించిన స్థానిక ప్రజలు, ఇప్పుడు ఆ అభి ప్రాయాన్ని మార్చుకున్నారని స్పష్టం అవుతున్నది.

కెసిఆర్ ఎక్కువగా ఫాంహౌజ్‌ లోనే ఉంటున్నా స్థానిక ప్రజలు ఎవ్వరికీ ఆయనను కలుసుకొని, తమ సమస్యలు విన్నవించుకొనే అవకాశం దక్కడం లేదు. తరచూ , ఫాంహౌజ్‌ కు వస్తున్నా సమీప గ్రామాలలో కెసిఆర్ తిరిగిన సందర్భాలే పెడగా ఉండటం లేదు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.