శ్రీలంక అద్యక్షుడి హత్యకు భారత్ కుట్ర అంటూ దుమారం

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన హత్యకు భారత్‌కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) కుట్ర పన్నుతోందని ఆరోపించిన్నట్లు బుధవారం తప్పుడు వార్తలు వ్యాప్తి చెందడంతో పెను దుమారం చెలరేగింది.  మంగళవారం కొలంబోలో జరిగిన కేబినెట్ సమావేశంలో సిరసేన ఈ ఆరోపణలు చేసిన్నట్లు ప్రచారంలోకి వచ్చిన ఈ వార్త తీవ్ర సంచలనం కలిగించింది.

అయితే సిరిసేన స్వయంగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి బుధవారం రాత్రి ఫోన్ చేసి అవన్నీ కల్పిత వార్తలే అని, వాటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసారు. శ్రీలంక విదేశాంగ శాఖ, ఇతర ప్రభుత్వ వర్గాలు కుడా ఈ వార్తలను తీవ్రంగా ఖండించాయి. దానితో ఈ దుమారం 24 గంటల లోగానే చల్లబడింది.

శ్రీలంక అద్యక్షుడు ఈ విధంగా మంత్రివర్గ సమావేశంలోనే చెప్పిన్నట్లు వచ్చిన కధనాలు శ్రీలంక, భారత్ ప్రభుత్వ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వాఖ్యలతో రెండు దేశాల సంబంధాలు కూడా దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు కలవర పడ్డాయి. పైగా, కొద్ది రోజుల్లో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో సిరిసేన ఇటువంటి వాఖ్యలు చేసిన్నట్లు కధనాలు వెలువడటం ఆందోళనకు గురిచేశాయి.

అయితే సిరిసేన ఈ కధనాల గురించి తెలియగానే తక్షణమే భారత్ ప్రధాని మోడికి ఫోన్ చేసి ఈ కధనాలు దురుద్దేశ్యంతో కుడుకున్నాయని, ఎటువంటి ఆధారం లేనివని స్పష్టం చేయడంతో పరిస్థితులు సద్దుమనిగాయి. తమ ఇద్దరి మధ్య, రెండు స్నేహపూర్వక పొరుగు దేశాల మధ్య అపోహాలు సృష్టించడం కోసం ఉద్దేశ్య పూర్వకంగా కొన్ని వర్గాలు ఇటువంటి కధనాలు సృష్టించి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇటువంటి దుష్ప్రచారం జరిగిన్నట్లు త్తేలియగానే బహిరంగంగా వాటిని ఖండిన్కాహ్డంతో పాటు శ్రీలంకలోని భారత్ హై కమీషనర్ ను తాను పిలిపించి పరిస్థితిని వివరించిన్నట్లు సిరిసేన మోడికి వివరించారు. ప్రధాని మోడిని శ్రీలంకకు, వ్యక్తిగతంగా తనకు నిజమైన స్నేహితుడిగా భావిస్తున్నానని ఈ సందర్భంగా సిరిసేన స్పష్టం చేసారు.

రెండు దేశాల మధ్య గల సంబంధాలకు ఎంతో విలువ ఇస్తానని, ఈ సంబంధాలు రెండు దేశాలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తున్నాయని చెబుతూ వీటిని మరింతగా బలోపేతం చేయడం కోసం తామిద్దరం కృషి చేస్తున్నామని సిరిసేన మోడికి గుర్తు చేసారు. తక్షణమే సిరిసేన ఈ విషయంలో తీసుకున్న నష్ట నివారణ చర్యలను ప్రధాని మోడీ అభినందించారు.

ఈ వదంతులను భారత ప్రభుత్వం కుడా తీవ్రంగా ఖండించిన్నట్లు గుర్తు చేస్తూ `పొరుగువారు మొదట’ అనే విధానంతో తన ప్రభుత్వం పొరుగు దేశాలతో సంబంధాలను పటిష్ట పరచుకోవడం కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేసారు.